సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి 12వ తేదీ శనివారం నుండి పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ మూడు నెలలు అంటే అక్టోబర్, నవంబరు, డిసెంబర్‌లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, మిగతా శుభకార్యాలకు ఈ అక్టోబర్ నెల ఎంతో అనుకూలమైందని పండితులు చెప్తుండటంతో పెళ్లిళ్ల కోసం సన్నాహాలు మొదలుపెట్టేశారు. ఈ 3 నెలలలో 25 రోజులు మంచి ముహూర్తాలు..ఉన్నాయి. దీనితో అక్టోబర్‌ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 12,13,16, 20, 27 తేదీల్లో పెళ్లీలకు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇక నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17 తేదీలతో పాటు.. డిసెంబర్‌లో పది రోజులు ముహూర్తాలు ఉన్నాయి. ఇక భాజాభజంత్రీలు, కల్యాణ మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్‌ వారికి కూడా ఓ రైంజ్‌ లో ఆర్డర్లు మొదలయ్యాయి. ఇక భీమవరం మార్కెట్‌లోనూ సందడి మొదలైంది. షాపింగ్‌ మాల్స్, గోల్డ్‌ షాపుల్లో ,వస్త్ర దుకాణాలు, ఎలెక్ట్రానిక్స్ , ఫర్నిచర్ దుకాణాలలో అమ్మకాలు కూడా ఈ దసరా వేడుకల నుండే భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *