సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యో గార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యు ఎస్వారికి అదనంగా మరో ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ను సవరిస్తూ తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ,ఎస్సీ,ఎస్టీతరహాలోనే ఈడబ్ల్యు ఎస్కు ఐదేళ్ల వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్న వయోపరిమితి 39 ఏళ్లకు పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ లో అల్ప ఆదాయ వర్గాల కుటుంబాలలోని నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు పెరగనున్నాయి.
