సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. గడిచిన ఐదు రోజుల నుంచి ప్రతీ రోజూ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ. 600 వరకు తగ్గింది. నేడు,శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర తగ్గి రూ.51,800కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 తగ్గి రూ.56,730కి చేరింది. కాగా.. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో, విజయవాడ లలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510 కొనుగోలుకు అందుబాటులో ఉంది.
