సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లావాసులు కు ఇప్పటికే ఒక వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు , ఏలూరు తాడేపల్లి గూడెం మీదుగా ప్రయాణిస్తున్నప్పటికీ అక్కడ హోల్డ్ లేకపోవడం తో ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందుతున్న నేపథ్యంలో..జిల్లా కేంద్రం భీమవరం కు తీసుకొనిరావాలని రైల్వే శాఖ గత 3నెలలుగా ప్రయత్నిస్తున్న( ఈ న్యూస్ గత ఏప్రిల్ నెలలో మన సిగ్మా న్యూస్ లో వేసాము) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతిపాదనలకు చెన్నై సెంట్రల్ రైల్వే పచ్చజెండా ఊపింది. దీనితో వచ్చే జులై నెలలో భీమవరం వరకు రానుంది. అత్యంత వేగంగా ప్రయాణించే వందేభారత్ రైలు ప్రయాణ వివరాలు పరిశీలిస్తే.. చెన్నైలో ఉదయం 20677 నెంబర్‌తో 5.30కి బయలుదేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 3.20కి 20678 నంబర్‌తో చెన్నై వెళ్లుతుంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ స్టేషన్‌లో దాదాపు 3 గంటలు నిలిచిపోతుంది. దీనితో దక్షిణ మధ్య రైల్వే వందేభారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపాదించింది. దానికి చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో..అన్ని అనుకూలిస్తే వచ్చే నెలలో విజయవాడ నుంచి గంటలో భీమవరం అంటే సుమారు మద్యాహ్నం 1. 20 కల్లా భీమవరం చేరుకుంటుంది. తిరిగి ఇక్కడ నుంచి 2 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్లే విధంగా షెడ్యూల్ చేశారు. చెన్నై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రాత్రి 10 గంటలకు సెంట్రల్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ప్రస్తుతం జిల్లా నుంచి చెన్నైకు సర్కార్ మాత్రమే నడుస్తోంది. ఇది కూడా కాకినాడ నుంచి బయలు దేరి తణుకు, భీమవరం, ఆకివీడు మీదుగా సాయంత్రం పూట వెళ్లుతుంది.. ఇకపై పగటి పూట వందేభారత్ వస్తుండటంతో ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై ప్రయాణికులకు మరింత సౌకర్యం గా ప్రయాణం ఉండనుంది.
