సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికీ శుభవార్త! రాష్ట్రంలో 6,511 పోలీసు ఉద్యో గాల భర్తీకి మరో రెండు రోజుల్లోనోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యో గాలను భర్తీ చేయాలని సీఎం జగన్ కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశిం చిన నేపథ్యంలో మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ను ఖరారు చేసింది. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుం ది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. పోలీసు నోటిఫికేషన్ పోస్టుల వివరాలు ప్రకారం.. ఎస్సై (సివిల్): 387, ఎస్సై (ఏపీఎఎస్సై (సివిల్): 387, ఎస్సై (ఏపీఎస్పీ) పోస్టులు : 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులు: 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్బెటాలియన్)పోస్టులు: 2,520
