సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సర్వ శుభ ప్రదమైన శ్రావణ మాసంలో నేడు, ప్రధమ శుక్రవారం (July 25th 2025) నేపథ్యంలో మహిళలకు శుభవార్త! దేశంలో బంగారం, వెండి ధరలు (Gold Silver )భారీగా తగ్గాయి. నేటి ఉదయం సమయానికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,380 తగ్గి రూ.1,00,960 స్థాయికి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,540కి తగ్గిపోయింది. అదే సమయంలో, వెండి ధర కిలోకు రూ.2,000 తగ్గి రూ.1,17,100కి చేరుకుంది. ఈ ధరల పతనం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కూడా కనిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,27,900 లకు అందుబాటులో ఉంది. వెండి ధర కిలోకు ఢిల్లీ ముంబయ్ మార్కెట్ లలో కేవలం రూ.1,17,100అందుబాటులో ఉంది.
