సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వెళ్లే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక .. విశాఖపట్నం నగర శివారునున్న తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 26, 28, 30 తేదీల్లో విశాఖ-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717), విజయవాడ-విశాఖ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్‌ (67285), విశాఖ-రాజమండ్రి మెము పాసింజర్‌ (67286), కాకినాడ-విశాఖ మెము పాసింజర్‌ (17267), విశాఖ-కాకినాడ మెము పాసింజర్‌ (17268), ఈనెల 26, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22876), విశాఖ-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22875)లను రద్దు చేశామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *