సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో, నారప్ప వంటి సినిమాలు దర్శకుడుగా ఆయన సత్తా ను చాటిచెప్పాయి. ఇప్పడు శ్రీకాంత్ అడ్డాల రచన, దర్శకత్వం తో పాటు నటుడుగా కీలక పాత్రలో ‘పెదకాపు-1’ అనే సినిమాతో నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా ట్రైలర్ తో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఎక్కువ మంది కొత్త నటులే.. అఖండ’ నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి దీనికి నిర్మాత, అతని బావమరిది విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా, అలాగే చాలామంది కొత్త నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాత్సవ కథానాయకురాలి కాగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. కధ విషయానికి వస్తే.. 1962 సంవత్సరంలో గోదావరి ప్రాంతంలో వున్న ఒక గ్రామంలో గొడవల వలన అందరూ వలస వెళ్ళిపోతారు. 20 ఏళ్ల తరువాత 1982 లో కూడా ఆ గ్రామంలో భూస్వాములదే పైచేయి అవుతుంది, కుల రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సత్య రంగయ్య (రావు రమేష్) ఆ వూరికి ఒక మోతుబరి, ఎదురులేకుండా చాలామంది ఊరి ప్రజలని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతనికి వ్యతిరేకంగా బయ్యన్న (ఆదుకలం నరేన్) ఈ ఇద్దరూ ఆ ఊరి ప్రజలను తమ రాజకీయ, పలుకుబడి కోసం వాడుకుంటూ వుంటారు. అదే వూరిలో వున్నయువకుడు పెదకాపు (విరాట్ కర్ణ) తాము ఊరి చివర ఉంటే తక్కువ వాళ్ళం కాదని, ఈ ఇద్దరికీ ఎదురు తిరుగుతాడు. అదే సమయంలో ఎన్టీ రామారావు టీడీపీ పార్టీ ఆవిర్భావం తో ఊపు వచ్చి సామాన్యుడు అయిన పెదకాపు ఆ ఇద్దరి భూస్వాములను ఎదిరించి ఆ ఊరి ప్రజల మన్ననలు ఎలా పొందగలిగాడు? అన్నది కాదంశం .. ఇక సినిమా ఎలాఉండటే.. శ్రీకాంత్ అడ్డాల చెప్పాలనుకున్నది కచ్చితంగా చెప్పలేక తడబడ్డాడు.. అసలే కదంశం కులాలలపై ఉందికదా..? రెండు అగ్ర సామజిక వర్గాల మధ్య కాపు సామజిక వర్గం పైకి రాలేకపోయింది అని చెప్పాలని అనుకున్నాడా,?అతనికి ఏవైనా అడ్డంకులు వచ్చాయేమో? నటుడుగా మాత్రం చెలరేగిపోయాడు.. కొత్తవాళ్లు బాగా నటించారు. ఇక నటుడు రావు రమేష్ కు డైలాగ్స్ లేకపోవడం పెద్ద మైనస్.. చోటా కే నాయుడు ఫోటోగ్రఫి అదుర్స్.. సంగీతం బాగుంది. సినిమా పర్వాలేదనిపిస్తుంది..
