సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం యనమదురు కాలవ గట్టు మీదుగా ఉన్న పలు ఇళ్ళు ఇటీవల తొలగించిన నేపథ్యంలో అక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్న నేపథ్యంలో డిఎన్నార్ కళాశాలకు వెళ్లే రోడ్డులోని మహిమానిత శ్రీదుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అక్కడ ఎదురుగా పంటకాల్వ అవతల ఉన్న స్థలంలో సుమారు రూ 4 కోట్లతో అభివృద్ధి చేసి పునఃప్రతిష్ట చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, శనివారం ప్రకటించారు. . ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో శనివారం ఎమ్మెల్యే అంజిబాబు సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ..రోడ్డు వైండింగ్ లో భాగంగా యనమదుర్రు డ్రెయిన్ పై అనుకుని ఉన్న ఈ ఆలయాన్ని ఎదురుగా ఉన్న 9 సెంట్లు స్థలంలోకి త్వరలోనే మార్చుతున్నామని, సుమారు రూ 2 కోట్లతో స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. భీమవరం ప్రముఖులు పుర ప్రజలు సహకారంతో సుమారు 4 కోట్లతో శ్రీదుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణం జరగబోతుందని, ఈ ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. భీమవరం ప్రముఖులు, పుర ప్రజలు, దాతలు ముందుకు రావాలని, అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *