సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో భక్తులకు నిత్యా అన్నసమారాధన వితరణ ట్రస్ట్ కోసం నేటి, గురువారం ఉండి మండలం ఎండగండి వాస్తవ్యులు నంబూరి సూర్యనారాయణ రాజు, సూర్యకుమారి దంపతులు ఒక లక్ష రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ధర్మకర్తలు, చైర్మన్, అసిస్టెంట్ కమీషనర్ దర్శనం చేయించి ఘనంగా సత్కరించారు నేటి, సాయంత్రం రాష్ట్ర హైకోర్టు జడ్జి ఆకుల శేషసాయి, పంచ హరతుల సమయం లో దర్శించుకొన్నారు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, దేవాలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరావు, ధర్మకర్తలు చెల్లంకి నాగ శేషగిరి, ముత్యాల రామారావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి, కోయ వెంకటలక్ష్మి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు, పంచహారతులు అనంతరం దేవస్థానంవేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం, అమ్మవారి జ్ఞాపిక ప్రసాదాలు అందచేశారు.
