సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని స్థానిక సీనియర్ బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. .వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో అందించారు. ఎంపీ పాక సత్యనారాయాణ మాట్లాడుతూ.40 ఏళ్లుగా బీజేపీ నే నమ్ముకొని అంచెలు అంచెలుగా పదవులు పొందినప్పటికీ శ్రీ అమ్మ వారి దయతో రాజ్య సభ సభ్యునిగా పెద్దల సభకు వెళుతున్న నేపథ్యంలో శ్రీ మావుళ్ళమ్మవారిని అస్సిసులకోసం దర్శించుకోవడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. భారత్ సైన్యం మహాశక్తి శ్రీ అమ్మవారి అస్సిసుల తో,భారత ప్రజల ఆకాంక్షలతో పాకిస్తాన్ ఫై విజయం సాధించి తీరుతుందన్నారు.
