సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ తన ప్రధమ శత్రువు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏరిపారెయ్యడానికి యుద్ధ రంగంలోకి దిగి అప్రహత విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత మాత కు జేజేలు పలుకుతూ.. ప్రదర్శనలు, దేవాలయాలలో పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధ సమయంలో భారతదేశ సరిహద్దులలో అలుపెరగని పోరాటం చేస్తున్న త్రివిధ దళాల కు, భారత పౌరులకు ఎటువంటి హానీ జరగకుండా క్షేమంగా ఉండాలని, భగవంతుని అస్సిసులతో వారు మరింత విజయోత్సవంతో పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించాలనికోరుకుంటూ.. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ మరియు హోమ్ మంత్రి అమిత్ షాల క్షేమం కాంక్షిస్తూ .. నేటి శనివారం ఉదయం, భీమవరం స్థానిక ఇండియాన్ బ్యాంకు సమీపంలోని శ్రీ పార్వతిసమేత సోమేశ్వర స్వామి ఆలయం లో శ్రీ మహాగణపతి లక్ష్మీ యాగం ను మిర్తిపాటి గున్నేశ్వర రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి సిగ్మా ప్రసాద్ , లక్ష్మి కనకదుర్గ దంపతులు మరియు శివాలయ అర్చకులు వేలవేల రామకృష్ణ మరియు మణికాంతగారు,వేలూరి వినయ్ భక్తులు పాల్గొన్నారు
