సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తులు T వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు 20 గ్రాముల బంగారం కానుకగా భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మవారికి త్వరలోనే అమ్మవారి స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, దాతలు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదని అన్నారు. ఇప్పటికే అమ్మవారి స్వర్ణ వస్త్రం 80 శాతం పూర్తి అయ్యిందని అన్నారు.( ఇటీవల ఛాంబర్ అఫ్ కామర్స్ నూతన అడ్జక్షులు బొండాడ రాంపండు శ్రీ అమ్మవారి బంగారు చీరకు ఇంకా కావలసిన బంగారాన్ని భక్తుల నుండి త్వరలోనే సేకరించి ఇస్తామని ఎమ్మెల్యే అంజిబాబుకు హామీ ఇచ్చారు.) అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి దాతలను సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన , టీడీపీ నాయకులు పాల్గొన్నారు.. ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందజేశారు.
