సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర ఉత్సవాలు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ గురువారం జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1గంటకు శ్రీ అమ్మవారి నగరోత్సవం హంస వాహనంపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభము అవుతుంది. భారీగా కళాకారులతో శక్తి వేషాలు, బుట్టబొమ్మలా కోలాహలం, తీన్మార్ వాయిద్యాలు, మేళతాళాలుతో, గరగల నృత్యాల కళాకారులతో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణంలో రాత్రి వరకు జాతర ను భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి దేవస్థాన ధర్మకర్తల కమిటీ,సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు మరియు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *