సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం మండలం అనాకోడేరు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ స్థానిక గ్రామస్తులు ఆయన ను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ .. సి ఎం జగన్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చెయ్యడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రజలు ముంగిటకు తీసుకోని వచ్చారని అందులో భాగంగానే ప్రతి గ్రామంలోను , పట్టణంలో ప్రతి వార్డులోనూ సచివాలయాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని అనాకోడేరు ప్రజలు కోసం 40 లక్షల వ్యయం తో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ సచివాలయ భవనము ఇక్కడి ప్రజలకు జవాబుదారిగా ఉంటుందని ప్రజలు సద్వినియోగ పరుచుకొని వారి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి వేదికగా వాడుకోవాలని పిలుపునిచ్చారు
