సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలోని.. దేశవ్యాప్తంగా హిందువులకు కీలక పుణ్యక్షేత్రమైన అన్నవరం లోని శ్రీసత్యదేవుడి సన్నిధిలో ఇటీవల వరుస వివాదాలతో సతమతమవుతున్న నేపథ్యంలో లోక కల్యాణార్థం దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు సంప్రోక్షణ కార్యక్రమా లు చేపట్టాలని నిర్ణయంచడంతో గత సోమవారం ఉదయం నుంచి దర్బారు మండపంలో మహా వేదపండితులతో సంప్రోక్షణ యాగాలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 15న ఉదయం 11గంటలకు పూర్ణాహుతితో ముగుస్తాయి. శ్రీమత్రిపాద్వి భూతి మహావైకుం ఠ నారాయణోపనిషత్‌ పారాయణలు, హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవస్థానం పండితులు పేర్కొన్నారు. ప్రధానాలయాల్లో ఏటా ఏదొక యజ్ఞయాగాధులు జరుగుతుంటుండగా అన్నవరం దేవస్థానంలో సైతం నిర్వహించేవారు. అయితే గత రెండేళ్లుగా ఏ యజ్ఞయాగాధి క్రతువులు నిర్వహించలేకపోయారు.ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో పండితుల సూచనల మేరకు ఈ కార్యక్రమాలు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *