సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్ఠమాస మహోత్సవాలు ముగింపు రోజు కావడంతో నేడు, సోమవారం దేవాలయంలో శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటలనుండి వైభవముగ నిర్వహించారు..దేవస్థానం సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కి పుట్టింటి అత్తింటివారు గా వ్యవహరించే అల్లూరి వారు, మెంటే వారు వంసంస్థులచే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, మరియు ధర్మకర్త మండలి వారు ఉయ్యాల సేవలో పాల్గొన్నారు….కార్యక్రమం అనంతరం మెంటే వారు కుటుంబీకులు, అల్లూరి వారి కుటుంబీకులు కు, తగు సత్కారం చేసి వేద ఆశీస్సులు తో పాటు, ప్రసాదం అందచేసారు
