సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి వేడుకలకు దూరప్రాంతాల నుండి భీమవరం వస్తున్నా భక్తులు బంధువులు విశేషంగా శ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొంటున్నారు. నేటి శనివారం ఉదయం 60వ వార్షికోత్సవాలు ప్రారంభ ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన చిన్నారి సుందర మహతి అనే అమ్మాయి పేరు మీద వాళ్ళ కుటుంబసభ్యులు 14 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారని, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వారికీ శ్రీ అమ్మవారి శాలువ మరియు ఫోటో ,ప్రసాదం వారికి అందచేసినారు,
