సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని శుక్రవారం నేపథ్యంలో విశేషంగా భక్తులు దర్శించుకోవడం జరిగింది. రాజమండ్రి వాస్తవ్యులు స్వర్గీయ తమ్మన కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి భార్య సుబ్బలక్ష్మి శ్రీ అమ్మవారి స్వర్ణాభరణం నిమిత్తం ఎనిమిది గ్రాముల బంగారము మరియు శ్రీ అమ్మవారి నిత్య అన్నదానం నిమిత్తం పదివేల రూపాయలు శ్రీ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాఊరి సుందర రావు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
