సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నేటి శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా నేటి సాయంత్రం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు వీరికి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శ్రీ అమ్మావారి శేష వస్త్రం కప్పి గౌరవించారు. ఇదిలా ఉండగా PAC కమిటీకి సభ్యులుగా తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు ఆరిమిల్లిరాధాకృష్ణ ఎన్నిక కావడంతో టీడీపీ అభిమానులలో హర్షం వ్యకం అవుతుంది.
