సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 13వ తేదీ నుంచి జరగనున్న భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిద డిపార్ట్మెంట్ అధికారులు, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. ఈనెల 13 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు జరగనున్నాయని, జాతర ఆఖరి 8 రోజులు అమ్మవారిని అష్టలక్ష్మీలుగా అలంకరణ చేస్తారని, ఫిబ్రవరి 14న అన్న సమారాధన జరుగుతుందని, సుమారు లక్ష మంది భక్తులు తరలి వస్తారని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, నీరుల్లి, కూరగాయ, పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిద డిపార్ట్మెంట్ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *