సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నేడు, శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో కళాశాల విద్యార్థులకు గాయాలైన ఘటన వారి తల్లి తండ్రులను ఆందోళనకు గురిచేసింది. స్థానిక రుస్తుంబాద 216 జాతీయ రహదారిపై బల్లకట్టు వద్ద సీతారాంపురం నుండి నరసాపురం టౌన్‌కు కళాశాల విద్యార్థులతో వెళుతున్న ఆటోకి మోటార్‌ సైకిల్‌ అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడిపోయింది. అది పిల్లిమొగల్లు వేస్తూ ప్రక్కనే ఉన్న నీరులేని పంటకాలువలోకి వెళ్లి పోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు అదృష్టవసాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ గట్టిగ గాయాలు కావడంతో వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *