సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం నందు నేడు, పవిత్ర కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్బంగా “చండి హామం “ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈసారి ఎక్కువ సంఖ్యలో సుమారు 150 జంటలు పాల్గొనడం విశేషం.. అలాగే శ్రీ మావుళ్ళమ్మవారి అమ్మవారి పాద మండలి దీక్ష మాతలకు మాలాధారణ నేటి సోమవారం తెల్లవారు జామున 4గంటలకు నిర్వహించడం జరిగింది. రేపు మంగళవారం శ్రీ అమ్మవారికి చెందిన హుండీలు తెరచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కిస్తామని ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.
