సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ప్రజలకు మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పట్టణానికి చెందిన అక్కిరెడ్డి సీతారాం, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక మౌని తన నానమ్మ అక్కిరెడ్డి జయలక్ష్మి పేరున రూ 1లక్ష వెయ్యి 116 లను మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్ట్ కి నేడు, బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి నాగన్న బాబుకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రియాంక మౌని తన పుట్టినరోజును పురస్కరించుకుని పెద్దల పేరుతో అమ్మవారి నిత్య అన్నదానానికి విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
