సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం వద్ద నేడు, శనివారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జన్మదినం నేపథ్యంలో ధర్మకర్తల మండలి చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు ఇతర సభ్యులు కలసి గ్రంధి శ్రీనివాస్ క్షేమం కాంక్షిస్తూ ,, శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించి తదుపరి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి, మావూరి సుందరరావు రామాయణం సత్యనారాయణ. గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ , నీలాపు విజయ నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
