సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానము లో నేడు, బుధవారం గత 70 రోజుల నుండి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కింపు నిర్వహించగా రూ. 59,93,397-00 ఆదాయం వచ్చిందని, బంగారము 105 గ్రాములు,300 మిల్లిలు కానుకలు రాగ, వెండి: 241 గ్రాములు,800 మిల్లిలు కానుకలుగా కొన్ని విదేశీ కరన్సీ నోటులు వచ్చాయని, ఈ యొక్క లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారని, దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ప్రకటించారు. ఈ రోజు సివిల్ సప్లయ్ మంత్రి వర్యులు కారుమూరి నాగేశ్వరరావు దంపతులు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం తో స్వాగతం పలికి ఆలయ ప్రదనర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజాకార్యక్రమాలు నిర్వహించారు
