సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి అతి త్వరలోనే స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, స్వర్ణ వస్త్రానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, మంగళవారం పట్టణానికి చెందిన ఇన్నమూరి యోగ శివాన్స్, వేదన్ష్, పి హర్షిల్ బంగారు తల్లి శ్రీ అమ్మవారిని దర్శించుకొని కానుకగా 200 గ్రాముల (సుమారు 20 లక్షల విలువ కలిగిన) బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘంకు అందించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, ఐ కృష్ణారావు దంపతులు, స్వర్ణ వస్త్ర నిధి సేకరణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *