సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు విచారణకు రావాలని తాజగా ఈడి నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ అనుబంధం.. సాయి సూర్య డెవలపర్ (Sai Surya Developers) వ్యవహారంలో వారి వ్యాపార ప్రకటనల్లో మహేష్ బాబు నటించినందుకు కాను కోట్ల రూపాయల పారితోషికం అనుకున్న నేపథ్యంలో ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. (ఈనెల 16న హైదరాబాదులో సాయి సూర్య, సురాన గ్రూప్‌లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.) వారి సంస్థల యాడ్స్‌లో నటించినందుకు, మహేష్ బాబు మొత్తం రూ. 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నారని.. దీనికోసం రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా ఆయనకు చెల్లింపులు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సునారా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టి…బ్యాంకుల రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ (CBI) మూడు కేసులు నమోదు చేసింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ ఫై కూడా వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
