సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా దేవీ శరన్నవరాత్రి ఆఖరి రోజు విజయదశమి వేడుకలు ముగింపు నేపథ్యంలో ఉత్తరాది రాష్టాల వారు కూడా శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. గత మధ్యాహనం నుండి రాత్రి వరకు వేడుకలు మరింత జోష్ అందుకొన్నాయి. మధ్యాహ్నం 1-05 నిముషాలు కు.. దాతలు మద్ధుల ప్రసాద్ కుటుంబం 10 లక్షలు వ్యయం తో శ్రీ అమ్మవారికి సమర్పించిన నూతన రధాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు లాగి రదోత్సవం కార్యక్రమం వైభవముగా ప్రారంభించారు…తదుపరి శ్రీ అమ్మవారిని ఉండి శాసన సభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు దర్శించుకున్నారు . వారికీ ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో ప్రసాదాలు అందచేసారు..మధ్యాహ్నం 4 కి రధోత్సవం ఉత్తర భారతీయ తరహాలో కొత్తగా భారీ డప్పు వాయిధ్యాలతో అత్యంత వైభవం గా పుర వీధుల్లో. శ్రీ అమ్మవారి రధ యాత్ర ఘనంగా నిర్వహించారు.. రాత్రి 7 కి రద యాత్ర తిరిగి దేవస్థానం వద్ద ముగించి..శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తి ని గర్భాలయంలో..తిరిగి యదాస్థానంలో.. ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పెట్టారు… అనంతరం రాత్రి 8 గంటల నుండి శమీ ( జమ్మి చెట్టు ) పూజ ఘనంగా నిర్వహించారు..రాత్రి వరకు వేలాది భక్తులతో.. దేవస్థానం ఆవరణ ప్రాంతమంతా దసరా ఆధ్యాత్మిక శోభ తో తేజోవంతమైయ్యింది… రేవు శనివారం ఉదయం 10 గంటలకు దేవాలయ ఆవరణలో అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసారు. దీనితో అత్యంత వైభోపేతంగా జరిగిన వేడుకలు పరిపూర్ణం అవుతాయి.
