సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానములో జరిగిన విశేషాలు పరిశీలిస్తే, హుండీ తెరచి లెక్కించగా గత 45 రోజులకు వచ్చిన ఆదాయం రూ. 41,72,846. బంగారం: 96 గ్రాములు 300 మిల్లి గ్రాములు, వెండి 143 గ్రాములు విదేశీ కరన్సీ నోటులు వచ్చినవి. ఈ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది. మొన్న జువ్వలపాలెం వాస్తవ్యులు శ్రీమతి కలిదిండి రాజ్యలక్ష్మి 8 గ్రాముల బంగారం మరియు వారి తండ్రిగారు జంపన కృష్ణమూర్తి రాజు, రెండు గ్రాముల బంగారం శ్రీ అమ్మవారి స్వర్ణాభరణం నిమిత్తం కానుకగా అందజెయ్యగా వారికి ఆలయ అర్చకులు కొడమంచిలి కోప్పేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ అమ్మవారి తీర్థప్రసాదములు అందించారు, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి దుప్పల వెంకట రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.. నేడు, మంగళవారం గొల్లవాని తిప్పకు చెందిన భక్తులు చీదే లక్ష్మణరావు 4గ్రాముల బంగారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు,
