సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం .. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో “చండీహోమం’ను ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ మరియు వేదపండితులు ఘనంగా నిర్వహించారు. చండి హోమంలో మొత్తం 87 మంది దంపతులు పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,తెలిపారు
