సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విభిన్న సినిమాలు లో ప్రాణం పెట్టి నటించే తమిళ హీరో సూర్య కు తెలుగులో కూడా ప్రత్యేక ప్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గత దశాబ్దంగా సరైన హిట్ సినిమా సూర్యకు పడలేదు. దానితో 250 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మిత్రులు యూవీ క్రియేషన్స్ సహకారంతో గ్రీన్ స్టూడియో… తెలుగువాడు తమిళ అగ్ర దర్శకుడు శివ దర్శకత్వంలో నిర్మించిన కంగువా భారీ అంచనాలతో నిన్న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 1000 కోట్లు టార్గెట్ లక్ష్యం అంటూ ప్రచారం జరిగినప్పటికీ సినిమాలో అంత లేదని ఓపెనింగ్ టాక్ లోనే తేలిపోయింది. అయితే ఎప్పటి లనే సూర్య మాత్రం 2 పాత్రలలో చెలరేగి నటించడం, చివర్లో కార్తీ కూడా స్క్రీన్ ఫై కనపడటం మినహా మిగతా సినిమా అంతా పెద్ద పెద్ద అరుపులతో నింపేసారని పబ్లిక్ టాక్ .. కొన్ని సీన్స్ గ్రాఫిక్స్ అపూర్వముగా చేసారని అయితే ఇది బాహుబలికి పోటీ ఇచ్చే చిత్రం కాదని తేలిపోయింది. తెలుగులో కూడా పెద్ద ఓపెనింగ్స్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యా ప్తం గా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది సూర్య సినిమాలకు మాత్రమే రికార్డు గా నిలచింది. ఇక దేశవ్యా ప్తంగా థియేటర్లన్నీతొలిరోజు సగటున 40శాతం ఆక్సుపెన్సీతో మాత్రమే నడిచినట్లు ఓ నివేదిక తెలిపింది. సినిమా కలెక్షన్స్ ఇంకా పుంజుకోవలసి ఉంది లేని పక్షంలో భారీ నష్టాలు తప్పవు..
