సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలోస్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సలహా సూచనల మేరకు ఉగాది వేడుకలు వైభవముగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.ఈ విశ్వంలో ఉగాది అనగా విశ్వాన్ని వశం చేసుకున్న విష్ణుమూర్తి పేరిట వచ్చిన శుభ సంవత్సరం కావున ప్రజలందరికీ వ్యాపారాలు పెరిగి సిరిసంపదలు కలగాలని ఈ శుభ సంవత్సరంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి రెండు పసుపు కొమ్ములు ఒక నాణెం కుంకుమ ప్రసాదం వితరణ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ప్రముఖ బ్రహ్మ శ్రీ వారణాసి సేతు మాధవ లక్ష్మి నరసింహ మూర్తీ గారిచే విశ్వావసు నామ సంవత్యర పంచాంగ శ్రవణ కార్యక్రమం మరియు ప్రముఖ జ్యోతిష్యవేత్త బ్రహ్మశ్రీ ర్యాలీ కృష్ణ ప్రసాద్ సిద్ధాంతి కి దేవస్థానం తరపున గౌరవ సత్కారం జరుగును. తిరిగి సాయంత్రం 6. 30 గంటలకు ప్రముఖ వాగ్భూషణ్ అవధాని కళాధర శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మరియు సంచాలకులు దాయన సురేష్ చంద్రాజీ ఆధ్వర్యంలో అష్టావధానం కార్యక్రమం నిర్వహించుచున్నామని, ఈ అష్టావధానం కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని స్ఫూర్తి పొందాలని పిలుపు నిచ్చారు.
