సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శనివారం నాడు ఉదయం నుండి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల దీక్షా విరమణ మరియు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 600పైగా భక్తులు శ్రీ అమ్మవారి దీక్ష లు తీసుకోవడంతో , ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండంవద్ద మండల దీక్షాపరులచే ఇరుముడి దీక్ష విరమణ, పూర్ణాహుతి నిర్వహించి కార్యక్రమం ఎక్కువ సమయం పట్టింది. దేవాలయ ఆవరణలోనే పందిళ్లు ఏర్పాటు చేసి శ్రీ అమ్మవారి కటౌట్ వద్ద దీక్ష విరమణ పూజలు నిర్వహించి హమంలో శ్రీ అమ్మవారికి నెయ్యాభిషేకం నిర్వహించారు. తదుపరి అనంతరం వచ్చిన దీక్ష విరమణ దారులకు వారి కుటుంబసభ్యులకు భక్తులకి అన్నప్రసాదo వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మెన్ మానేపల్లి నాగేశ్వరరావు, ఇతర సభ్యులు , సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రాజీ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ ఆవరణ నలువీధులలో దీక్ష దారులు, భక్తుల సందడి తో ఆధ్యాత్మిక శోభ కనపడింది.
