సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండల దీక్షధారణ పౌర్ణమి సందర్బంగా సంప్రదాయబద్ధంగా ప్రారంభమైయింది. నేడు శనివారం ఉదయం 5.15 నిమిషాలకు సుమారు 90 మంది భక్తులు అమ్మవారి మాలధారణ ధరించారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి భక్తులను మాలధారణ చేశారు. 41 రోజులపాటు మండల ధారణ జరుగుతుందని ఆలయ ఈవోయర్రంశెట్టి భద్రజీ తెలిపారు. నవంబర్ 17న అర్ధమండలి దీక్ష, 27న పాదమండల దీక్ష, డిసెంబర్ 7న దీక్ష విరమణ, మహా పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి ఈ మాలధారణ జరుగుతుందని తెలిపారు. ప్రజలకు శాంతి సౌఖ్యాలు అందాలని వేదపండితులతో చండి హోమము’ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలలో ఆలయ చైర్మన్ మానేపల్లి నాగన్నబాబు, సభ్యులు మావూరి సుందరరావు, ముత్యాలరావు, చెల్లంకి గిరి, రామాయణం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
