సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. చూడముచ్చటైన నిలువెత్తు శ్రీ అమ్మవారి అవతారం ను దర్శించుకొని భక్తులు తల్లి అస్సిసులు పొందుతున్నారు. నేటి ఉదయం కుంకుమ అర్చన లు ఘనంగా జరిగాయి. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తో పాటు నేటి రాత్రి 7గంటల నుండి నిర్వహించనున్న కూచిపూడి నాట్యం హైలైట్ కానున్నది. కావున భక్తులు ఈ సాంసృతిక కార్యక్రమాలకు అందరు ఆహ్వానితులే.. గునుపూడి పంచా రామం వద్ద కూడా దసరా మహోత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
