సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్మోహన్ రెడ్డి విడిచిన బాణం షర్మిల తిరిగి మా పార్టీకే తగిలే అవకాశం కనిపిస్తోంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే, దాని ప్రభావం మా పార్టీపైనే తీవ్ర ఉండనుంది. మా పార్టీ కి చెందిన మూడు నుంచి నాలుగు శాతం ఓట్ల పై షర్మిల తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీ పరిధిలో షర్మిల, ఆమె భర్త అనిల్ నాకు అందించిన సహకారం మరువలేనిది.. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏది చేయరు. ఏదైతే చేశాడో అదే చెబుతారు. తల్లి, చెల్లి, బాబాయిని చూసినట్టుగానే ప్రజల్ని కూడా చూస్తున్నారు. ఇక రామగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్యూహం’ సినిమాపై ఎంపీ రఘురామా మాటలలో… ప్రతి నాయకుడిని హీరోగా చూపే పంథా కలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన గతంలో రూపొందించిన సత్య, సర్కార్ చిత్రాలు ఇదే కోవకు చెందినవి. ఇప్పుడు 32 కేసులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి జీవిత గాధను ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేను అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.,నేను అసహ్యించుకునే రాజకీయ నాయకున్ని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. బాబాయిని హత్య చేసిన సంఘటనలో వైయస్ కుటుంబీకుల పాత్ర, నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన సీన్లు ఈ సినిమాలో ఉండకపోవచ్చునని రఘురామకృష్ణంరాజు అన్నారు. up file photo.
