సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొంతకాలం క్రితం ఒకటికి పది రెట్లిస్తాం .. డబ్బులే డబ్బు లు అంటూ విజయవాడలో సంకల్ప సిద్ధి మార్ట్ పేరుతో ఏర్పాటైన చెయిన్ లింక్, మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ తెలుగు రాష్ట్రాలలో ఎందరినో కోట్ల రూపాయలకు ముంచేసి తాజగా బోర్డు త్రిప్పేసిన ఘటన సంచలనం రేపింది. సంకల్ప సిద్ధి మార్ట్ పేరుతో ఏర్పా టైన చెయిన్ లింక్, మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ మోసాలు బహిర్గతమయ్యాయి. విజయవాడ సీతారాంపురంలోని దుర్గా అగ్రహారంలో ఏడాది క్రితం ఓ అద్దె ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ యాప్ ద్వారా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. పదిరోజులుగా యాప్ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో సభ్యత్వం కోసం రూ.3 వేలు చొప్పున బాధితుల నుంచి వసూలు చేసి నమ్మకం కలిగించేందుకు సరుకులు ఇచ్చారు. ఐదు రకాల స్కీంలతో చెయిన్ చీటింగ్ చేసారు అని ఆరోపణ.. . రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామని ఆశపెట్టి ఎందరినో మోసగించారని సమాచారం. పిర్యదులు రావడంతో నిడమానూరులోని సంకల్ప సిద్ధిమార్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంస్థకు చెందిన సాఫ్ట్ వెర్ డేటాను సీజ్ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి రూ.2.5 కోట్ల నగదును సీజ్ చేశారు. సంస్థ చైర్మన్ గుత్తా వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చట్టపరమైన చర్యలు తీసుకొని సంకల్పసిద్ధి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం అని పోలీస్ అధికారులు భరోసా ఇస్తున్నారు మరి.. చూడాలి..
