సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల గోదావరి జిల్లాలకు 41 ప్రత్యేక రైళ్లను ప్రకటించి ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటు తాజగా.. మరో 16 ప్రత్యేక అదనపు రైళ్లను గోదావరి జిల్లాల మీదుగా నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం నడిచే రైళ్లు చర్లపల్లి, ఖాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్నపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. వాటిలో కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు చుస్తే.. జనవరి 9, 11 తేదీలలో (రైల్ నెంబర్ 07288) సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు వరకు.. జనవరి 10, 12 తేదీల్లో (రైల్ నెంబర్ 07289) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్.. జనవరి 10, 12, 16, 18 తేదీలలో (రైల్ నెంబర్ 07290) సికింద్రాబాద్ – శ్రీకాకుళంరోడ్డు.. జనవరి 11, 13, 17, 19 తేదీలలో (రైల్ నెంబర్ 07291) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్.. జనవరి 13వ తేదీలో (రైల్ నెంబర్ 07294) వికారాబాద్– శ్రీకాకుళంరోడ్డు.. జనవరి 14వ తేదీ (రైల్ నెంబర్ 07295) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్జనవరి 17వ తేదీ (రైల్ నెంబర్ 07297) సికింద్రాబాద్ – శ్రీకాకుళంరోడ్డు.. జనవరి 18వ తేదీ (రైల్ నెంబర్ 07293) శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్.. ఉన్నాయి.
