సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి. కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు తెరచే ఉంటాయా..? అనే ప్రశ్న వస్తుంది. అలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా .. స్పష్టత ఇచ్చింది. జనవరిలో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇందులో 4 ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. 13వ తేదీ భోగి పండగ వచ్చింది. ఈ రోజు రెండో శనివారం అయినందున బ్యాంకులకు సెలవు ఉంటుంది. 15వ తేదీ సోమవారం సంక్రాంతి పండగ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, అసోంలో సెలవు ఉంటుంది. మిగిలిన రోజులు ప్రాంతాలను బట్టి సెలవు ఉంటుంది.జనవరి 16వ తేదీ 17వ తేదీన తమిళనాడు, చండీగఢ్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
