సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడాది లోపు పాత, స్టీమ్ సన్న బియ్యం 26 కేజీ ప్యాక్ కు 1400 నుండి `1650 వరకు ధర వద్ద గత 2 నెలలుగా నిలకడగా ఉండగా ఎన్నికలు పోలింగ్ ఆలా ముగిసిందో లేదో ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా 1500 నుండి 1800 రూపాయల ధరకు చేరుకొంటున్నాయి. మరి కొద్దీ రోజులలో బాస్మతి ధరల స్థాయిలో చేరే అవకాశం కనపడుతుంది. ఇటీవల దాళ్వా పంట కూడా బాగా దిగుబడి వచ్చింది. అయితే స్థానికంగా డెల్టా ప్రాంత పొలాలలో ముతక రకాలు ధాన్యం పండించడంతో అవి ఇక్కడి ప్రజలు పెద్దగా వినియోగించరు. ఇక్కడి ధాన్యం పంట బయట ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. . తెలంగాణ, తూర్పుగోదావరి. కర్ణాటక తో సహా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసు కుంటున్న సన్నరకం బియ్యానికి ఇక్కడ డిమాండ్‌ పెరిగింది. మొన్నటి వరకూ సోనా రకం సన్న బియ్యం క్వింటా రూ. 4,800 ఉండగా ఇప్పుడు రూ.5,300కు పెరిగింది. హెచ్‌ఎంటి రకం బియ్యం రూ.5,600 నుంచి రూ.6 వేలకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం కోటా బియ్యంలోనూ సన్నరకాలు కాకపోయిన కాస్త మెరుగైన బియ్యం పంపిణి చెయ్యడం తో వాటి వినియోగం కూడా పెరిగింది. సాయంత్రం టిపిన్ తదితర రకాలుగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భారత్ రైస్ మాల్స్‌లో స్వర్ణ వంటి మీడియం రకాలు కిలో రూ.29లకే లభిస్తున్నాయి.ప్రజలు.దానితో సన్నబియ్యం కొనుగోళ్లు గతంతో పోలిస్తే బాగా తగ్గిందని రిటైల్ వర్తకులు అంటున్నారు. అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాలలో ఫై స్థాయిలో ఒక సిండికేట్ క్రింద ధరలు తగ్గకుండా అడ్డుకొంటున్న వర్గం ఫై ఇంటెలీజెన్స్ అధికారులు నిఘా, చర్యలు పెంచాలని ప్రజలు రిటైల్ బియ్యం వ్యాపారాలు కూడా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *