సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నేడు, మంగళవారం పెద్ద ఊరట లభించింది. ఏపీ పోలీసులు కొత్తగా పెట్టిన మూడు కేసులపై పిన్నెల్లి హైకోర్టు కు వెళ్లి పోలీస్ అధికారులు తనను ఒక పధకం ప్రకారం అరెస్ట్ చెయ్యడానికి ఎన్నికల కౌంటింగ్ కి వెళ్లకుండా చూడటానికి కొత్తగా కేసులు పెడుతున్నారని,ఆరోపిస్తూ వాళ్ళు కోర్ట్ ను తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టు కు వెళ్లడంతో .. అయన వాదనలోని ఆధారాలు హైకోర్టు పరిశీలించిన తదుపరి నేడు, మంగళవారం ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. జూన్ 4వ తేదీన మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవచ్చునని తెలిపింది. ఆ రోజున రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడంతోనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. జూన్ 6వ తేదీన మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది.
