సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీనియర్ హీరోగా కమల్ హాసన్ కు విశ్వరూపం తరువాత విక్రమ్ తో బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, కమల్ హాసన్ తో కలసి తాజగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం విజయ్ హీరోగా సినిమా చేస్తున్నానని, దీనితరువాత ఖైదీ 2 మొదలు పెడతా.. దానితరువాత కమల్ హాసన్ తో కలసి హీరో సూర్య రోలెక్స్ పాత్ర హైలైట్ గా ఒక మూవీ ఉంటుం దని, అయితే పరిస్థితులను బట్టి ఖైదీ 2, విక్రమ్, రోలెక్స్ ( కేవలం సూర్య డ్రగ్స్ మాఫియా డాన్ గా ఎదిగిన తీరుపై..) సినిమాలు ఎదో ఒకటి ముందు మొదలు పెడతానని, గత చిత్రాల వలె ఇవన్నీ ఒక కథతో ఒకటి అనుబంధం ఉన్న పాత్రలతో సీక్వెల్స్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని.. ఇలా 10 ఏళ్ళు వరకు సినిమాలు తీసే సరుకు తన వద్ద ఉందని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సంచలన వ్యాక్యలు చేసారు. నిజానికి ‘విక్రమ్’ మూవీలో డ్రగ్ మాఫియాను శాసించే కరుడుకట్టిన ఉన్మాది రోలెక్స్ పాత్రలో సూర్య . క్లైమాక్స్లో ఆయన కనిపించింది కొద్ది సేపే అయినా,అదరకొట్టేసాడు. ఇక ఈ మూవీ తర్వాత ‘ఖైదీ2’ ఉంటుందని అన్నదమ్ము లైన సూర్య , కార్తి వెండితెరపై మల్టీస్టార్ గా కనపడితే చూద్దామని ఎంతోకాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు.. చూద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *