సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ , శృతి హాసన్ జంటగా, జగపతి బాబు, పృథ్విరాజ్ కీలకపాత్రలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ ది సీజ్ ఫైర్’.. మొదటి భాగం ఈ డిసెంబర్ 22 న విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా నేడు, మంగళవారం సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు, అలాగే సినిమా కూడా మూడు గంటలకి ఒక ఐదు నిముషాలు మాత్రమే తక్కువ అంటే 2 గంటల 55 నిముషాలు సినిమా నిడివి వుంది. ఈ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నామని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండో పార్టు సమ్మర్ సీజన్ లో విడుదల అవుతుంది అని భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా రెండో పార్టు కూడా షూటింగ్ పూర్తయిపోయింది అని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రెండో పార్టు కోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యాల్సిన పని లేదని అవసరం అనుకుంటే ఒకటి రెండు పాటలు మాత్రమే షూటింగ్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే సాలార్ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రచారాలు కూడా ఇంతవరకు మొదలెట్టలేదు,ఇది సినిమా ఓపెనింగ్స్ ఫై ప్రభావం చూపుతుందని అభిమానులు భావిస్తున్నారు. హీరో ప్రభాస్ ఈమధ్యనే ఇటలీ నుండి హైదరాబాదు వచ్చారు కానీ ఈ సినిమా ప్రచారాలకి దూరంగా వున్నారు. బహుశా విడుదలకి వారం వుందనగా ప్రమోషన్స్, మీడియా ముందుకు రావొచ్చు అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *