సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సౌజన్య సూసైడ్‌ నోట్‌లోని సంచలన విషయాలు నిన్న మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్రికా ముఖంగా బయట పెట్టారు. మరియు ఎక్స్ లో పెట్టారు. ప్రతి మహిళా మరణించే ముందు సౌజన్య రాసిన 5 పేజీల లేఖలు చదవాలని విజ్ఞప్తి చేసారు. ఆమె భర్త ను చంపటడంతో పాటు ఆమె కుటుంబాన్ని బెదిరించి అమలాపురం వద్ద 40 కోట్ల విలువ చేసే ఆస్తి రాయించుకొన్నాడని, ఆమెను తరచు మతం మారమని చిత్ర హింసలు పెట్టి వేధించేవాడని ఇది ఆమె స్వష్టంగా లేఖలో పేర్కొన్న ఇటు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కానీ, అటు ప్రతి పక్షంలో ఉన్న జగన్ గాని స్వాదించలేదని, ఓట్ల రాజకీయాలు ఇక్కడ ప్రవేశించాయా? కాబ్బటి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసారు. సాధిక్ ఇదే తరహాలో 15 మంది మహిళల కుటుంబాలలో చిచ్చు పెట్టాడని, ఇటువంటి వాడిని ప్రభుత్వం ఎందుకు ఉపెక్షిస్తుందో? అర్ధం కావడం లేదని ఇదే ముస్లీమ్ దేశాలలో అయితే రాళ్లతో కొట్టి చంపడం కానీ, బహిరంగంగా ఉరి తియ్యడం కానీ చేస్తారని అన్నారు. ఆత్మహత్య ల నుండి బయట పడ్డ సోజన్య కుమారుడికి తాను ఇకపై అండగా ఉండటానని ప్రకటించారు. వెలుగులోకి వచ్చిన లేఖలలో . సాదిక్‌ నిత్యం తనను వేధిస్తూ నరకం చూపించేవాడని, అతడి వేధింపులు తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదాం అని కూడా అనుకున్నట్లు బాధితురాలు సౌజన్య పేర్కొన్నారు. ‘ కొన్ని ప్రైవేటు వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. ఎదిరించిన ప్రతిసారీ చాలా తీవ్రంగా కొట్టేవాడు. ఎన్నో ఆస్తులు కాజేసాడు.మతం మారమని వేధించేవాడు అని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *