సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విభిన్న సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకుల కోసం గత ఆగస్టు 9న థియేటర్స్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సింబా’(SIMBAA) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమా నేటి శుక్రవారం నుండి ఆహా ‘ డిజిటల్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో కీలక పాత్రలలో జగపతి బాబు , అనసూయ నటించగా సంపత్ నంది టీం వర్క్స్ రచ్చ పేమ్ .. సంపత్ నంది దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈసినిమా కథ విషయానికి వస్తే: పర్యావరణ సంరక్షణ కు క్రైమ్ జోడించి ఈ చిత్రం ప్రయోగాత్మకంగా రూపొందింది. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ విచారణలో లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం ఎప్పుడో చనిపోయిన పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది? అనేదే ఈ సినిమా ట్విస్ట్..
