సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారీ వర్షాలతో ఫై నుండి వస్తున్నా వరద ప్రవాహంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.52లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హేచించింది. . అటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *