సిగ్మాతెలుగు ఇన్ న్యూస్: నరసాపురం నుండి భీమవరం మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో లో నరసాపురం–గుంటూరు, నరసాపురం – విశాఖ పట్నం వెళ్లే సింహాద్రి రైళ్లు ను రైల్వే శాఖ నిలిపివెయ్యడంపై పశ్చిమ గోదావరి జిల్లా తో పాటు కోనసీమ నుండి నరసాపురం వచ్చి రైళ్లు ఎక్కే ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రోజువారీ విజయవాడలో చదువుకునే విద్యార్థులు, వ్యాపారస్థులు, రాజధాని పనులకు వెళ్లేవారు ఈ రైలులోనే వెళ్తారు. ఉదయం ఆరు గంటలకు నరసాపురంలో బయలుదేరి విజయవాడ 9.30 గంటలకు వెళుతుంది. ఛార్జీ రూ.75. దీనికి ఏసీ కోచ్ ఉంది. తిరుగు ప్రయాణంలో విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి పది గంటలకు నరసాపురం చేరుతుంది. ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే గత నెల 13 నుంచి రద్దు చేసింది. విజయవాడ–గుంటూరుల మధ్య ట్రాక్ పనులు చేపడుతున్నందున వారం రోజులు రద్దు చేస్తున్నట్లు ముందు ప్రకటించింది. అయితే తాజాగా మరో వారం అంటే ఈ నెల 9 నుండి ? ప్రారంబిస్తామంటున్నారు. అవకాశం లేకపోతే కనీసం విజయవాడ వరకైనా నడపా లని డిమాండ్ చేస్తున్నారు. ఇక గతంలో నరసాపురం నుంచి భీమవరం జంక్షన్ మీదుగా విశాఖ పట్నం వెళ్లే సింహాద్రి లింకు ఉండేది. దాన్ని తొలగించి ప్రత్యామ్నాయంగా నిడదవోలు వరకు డెమో నడుపుతున్నారు. డెల్టా ప్రాంత వాసులు ఈ రైలు ఎక్కి నిడదవోలులో గుంటూరు నుంచి వచ్చే సింహాద్రి ఎక్కి విశాఖ వెళ్ళడం సులభం. అయితే ఈ రైలును కూడా ట్రాక్ పనులు అంటూ గత నెల 13 నుంచి రద్దుచేశారు. దీంతో పగటిపూట నరసాపురం, పాలకొల్లు, భీమవరం నుంచి సుఖంగా విశాఖ వెళ్లేందుకు మరో రైలు లేకపోయింది.ఈ రైలులో కేవలం రూ.120తో రైలులో విశాఖ వెళ్లచ్చు. అదే బస్సుకు వెళ్లాలంటే రూ.600 పైగా ఖర్చు చెయ్యాలి. మరల సింహాద్రి ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు
