సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం కౌంటింగ్ ప్రారంభమైన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఏకపక్షమైంది. వరుసగా 2వసారి ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌కేఎం గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. సిక్కిం డొమోక్రాటిక్ ఫ్రంట్ (SDF) కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకోండి. 2019 వరకూ 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఆసక్తికరంగా ఎస్‌డీఎఫ్ సుప్రీం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోక్లోక్ కామ్రాంగ్, నామ్‌చేబంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, రెండు స్థానాల్లోనూ ఆయన ఎస్‌కేఎం అభ్యర్థుల చేతిలో ఓటమిని చవిచూశారు. ఏప్రిల్ 19న తొలివిడతలో సిక్కింగ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక్కడ కొన్ని ప్రత్యేక కారణాలచే ఈసీ జూన్ 4న కాకుండా నేడు జూన్ 2నే కౌంటింగ్ పూర్తీ చేసింది.
