సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న అక్కినేని నాగార్జున కుటుంబం ఫై తీవ్ర స్థాయి విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, మంచు ఫ్యామిలీ వివాదం.. ఇటీవల పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో జరిగిగిన పరిణామాలతో సినీ ప్రముఖులపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నేడు, గురువారం బంజారాహిల్స్‌ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సీని అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేశ్, లతో పాటు నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ.. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, సి.కల్యాణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, మైత్రీ రవి, నవీన్..తదితరులు మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశమై ఆయనకు ముందుగా శాలువ కప్పి తదుపరి.. సినిమా టికెట్ రేట్లు, బెన్ ఫిట్ షోలు, సంధ్యా థియేటర్ ఘటన వంటి పలు పలు అంశాలపై చర్చించారు.అయితే ఇకపై తెలంగాణాలో సినిమా టికెట్స్ రేట్లు భారీగా అమ్మడం, బెనిఫిట్ షోలు ఉండవని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని ఆయన సినీ పెద్దలకు స్పష్టం చేశారు. ఇకపై సినీ నటుల బౌన్సర్లపై బొన్సర్ లు ప్రజలను తోసేసి హడావిడి చేస్తే చర్యలు ఉంటాయని హచ్చరించారు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తేల్చి చెప్పారు. మాజీ సీఎం చెన్నారెడ్డి హయాంలోనే సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సినీ నటులు డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత వంటి క్యాంపెయిన్లలో చొరవ చూపాలని సీఎం వారికి సూచించారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *